BREAKING
అమాట్–2026 పోస్టర్ ఆవిష్కరణ విడుదలకు నెల ముందే రూ.28 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్.. రామాయణ, ధురంధర్ 2 రికార్డులను దాటిన అవెంజర్స్ డూమ్స్‌డే! టీఎస్ యుటిఎఫ్ ఎంజెపి కరీంనగర్ వింగ్ ఎన్నిక *ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన 2వ వార్డు కౌన్సిలర్ బాణావత్ వెంకటరమణ నాయక్* యువతలో క్రీడలపట్ల ఆసక్తిని పెంపొందించాలి - కలెక్టర్ రాజర్షి షా పరవాడ ఎంపీపీగా కన్నూరు వెంకటరమణ, వైస్ ఎంపీపీగా బుగిడి రామ గోవిందరావు లు ఏకగ్రీవంగా ఎన్నిక సీన్ సక్సెస్.. నస్లేన్‌కు సూర్య కాస్ట్లీ కార్టియర్ వాచ్ బహుమతి.. బాక్సాఫీస్ జోరు ఇలా! కొత్తచెరువు ఎంపీపీగా మహాలక్ష్మి ఎన్నిక.. తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆ దర్శకుడిని నేనే స్వయంగా సినిమా అడిగాను.. వెంకీ కుడుములపై చిరంజీవి సరదా వ్యాఖ్యలు! ఇంకొల్లు మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా కోట శ్రీదేవి, ఉపాధ్యక్షులుగా నున్నా వెంకట్రావు బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో విద్యాబాలన్.. ఎన్బీకే112పై ఆసక్తికర ప్రచారం! భారత ఉక్కు మహిళ ఇందిరాగాంధీః మంత్రి వాకిటి ఈనెల 25న మెగా జాబ్ మేళా ముదిగుబ్బ ఎంపీపీ ఎన్నిక వాయిదా

తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

Select Suryaa Now
తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
తిరుపతి/శ్రీకాళహస్తి, నవంబర్ 19: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండల పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం తమ పార్టీకే దక్కాలంటూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

మరోవైపు, ఎన్నికల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు "ఎన్నికల అధికారి డౌన్ డౌన్" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంపీడీవో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.