కొత్తచెరువు ఎంపీపీగా మహాలక్ష్మి ఎన్నిక..
శ్రీ సత్య సాయి జిల్లాలోని కొత్తచెరువు మండల ఎంపీపీగా మహాలక్ష్మి ఎన్నికయ్యారు. కొత్తచెరువు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైకాపా నుంచి ఆరు మంది ఎంపీటీసీలు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఐదు మంది సభ్యులలో ముగ్గురు ఎంపీటీసీలు హాజరయ్యారు. వైకాపా నుంచి గెలుపొందిన ఆరు మంది ఎంపీటీసీలు ఎంపీపీగా మహాలక్ష్మిని ఎన్నుకున్నారు.