సూర్య కరీంనగర్ : టీఎస్ యుటిఎఫ్ ఎంజెపి వింగ్ జిల్లా ఎన్నికలు జిల్లా అధ్యక్షులు ముల్కల విజయ్ కుమార్,ఎంజేపీ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ బొజ్జ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎంజెపి వింగ్ జిల్లా అధ్యక్షులుగా యస్వాడ విశ్వకర్మ,ఉపాధ్యక్షులుగా బొమ్మ మంగారాణి,శనిగరపు విజయ్(ఎంజెపి గన్నేరువరం), ప్రధాన కార్యదర్శిగా పంజాల నరేష్(బాయ్స్ కొత్తపల్లి),సెక్రటరీలుగా దార్ల ఉదయ్(బాయ్స్ వీణవంక),షేక్ జాకీరుద్దిన్ (బాయ్స్ బూరుగుపల్లి)బి.వరుణ్ జ్యోతి,ట్రెజరర్ గా బి.వరుణ్ జ్యోతి,ఆడిట్ కమిటీ సభ్యులుగా వైద్య ఆంజనేయులు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు విశ్వ కర్మ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు సమయం 8గంటలు కు బదులుగా 9 గంటల కు మార్చాలని,CPS ను రద్దు చేసి OPS ఇవ్వాలని, గురుకులాలలో ప్రత్యేక కేర్ టేకర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.