BREAKING
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు హత్య బెదిరింపులు ఐపీఎల్ 2027 మినీ వేలంలో ఈ ఆటగాళ్లపై కాసుల వర్షం.. ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ! ఎంపీటీసీల విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనం: పార్టీలకతీతంగా ధర్మవరం మండల అభివృద్ధికి కృషి చేస్తాం — నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి తైవాన్ విషయంలో అమెరికా సరైన నిర్ణయం తీసుకోవాలి తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. అకెర్‌మన్ సెంచరీ, హార్మర్ ఆరు వికెట్లు! అమెరికా ఐపీఓ మార్కెట్‌లో రికార్డు నిధులు బైక్ ప్రమాదంలో కామన్వెల్త్ స్వర్ణ విజేతకు తీవ్ర గాయాలు.. చేయి కోల్పోయిన వెయిట్‌లిఫ్టర్! ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు. - డీఎస్పీ నరసింహారావు పడిక్కల్, పంత్ గందరగోళం.. చేతికందిన వికెట్ జారవిడవడంతో కెప్టెన్ గిల్ ఆగ్రహం! సీఎం సభకు రాయలపూర్ కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు అమెరికా సెక్యూరిటీస్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ నామినీలకు సెనేట్ పరీక్ష మండల స్థాయి చిత్రలేఖన పోటీలో జాహ్నవి రెడ్డికి ప్రథమ స్థానం అమెజాన్‌లో విజ్ఞాన్స్‌ లారా విద్యార్థినికి ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.1.30 లక్షల వేతనం తొలి టెస్ట్‌లో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఏమన్నారంటే!

నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి - ఉపాధ్యక్షులుగా చింతల కళ్యాణి

Select Suryaa Now
నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి  - ఉపాధ్యక్షులుగా చింతల కళ్యాణి

నగరం, మేజర్ న్యూస్: 
నగరం మండలంలో గెలుపొందిన 14 మంది ఎంపీటీసీలతో ఎన్నికల అధికారి కె. సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నగరం సెగ్మెంట్ ఎంపీటీసీ మోర్ల స్వరూపరాణి మండల పరిషత్ అధ్యక్షులుగా, ఈదుపల్లి సెగ్మెంట్ జనసేన పార్టీ ఎంపీటీసీ కళ్యాణి చింతల ఉపాధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేశారు. కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక వాయిదా పడింది. ఎంపీటీసీ లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కాసాని నెల్లిమ్మ (పూడివాడ), డాక్టర్ బాబు గుంటూరు(అల్లపర్రు), ఉప్పాల యానాదమ్మ (ఏలేటిపాలెం), ఆలూరి వెంకటేశ్వరరావు (ధూళిపూడి నార్త్), అబ్దుల్ జలీల్ (చినమట్లపూడి), కొక్కిలిగడ్డ హరిబాబు (బోరమాదిగపల్లి), దుర్గాభవాని ఉయ్యూరు (అద్దంకివారిపాలెం),   గోపాలకృష్ణమ్మ గోపరాజు (పెద్దవరం), శొంఠి శ్రీనివాసరావు (పెదపల్లి), పాగోలు శ్రీనివాసరావు (పెదమట్లపూడి),  ప్రతాప్ వసంతం (మంత్రిపాలెం),  సెగ్మెంట్ టిడిపి ఎంపీటీసీ గుంటూరు శ్రీదేవి (కొలగానివారిపాలెం) లున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు, ఇతర అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.