ఆస్పత్రి వద్ద పుర్రె ఎముకలు లభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు
*బిజెపి జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్*
*యాదాద్రి భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
*భారతీయ జనతా పార్టీ బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి వద్ద పుర్రె ఎముకలు తగలబడ్డ చోట లభించడం నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఊటుకూరు అశోక్ గౌడ్ తో ఏరియా ఆసుపత్రి ని సందర్శించి మౌలిక వసతులు మరియు రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ ఏరియా సూపర్డెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి వద్ద పుర్రె ఎముకలు బయటపడడం ఆసుపత్రి వెనుక భాగంలో మృతదేహాలను ఇక్కడే దహనం చేస్తున్నారా నివాసాల మధ్యలో ఆసుపత్రి ఉండగా ఇక్కడ ఎలా ఎందుకు దహనం చేస్తూనారు అనీ ప్రశ్నించడం జరిగింది. అదేవిదంగా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది మరియు మందుల కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు వారికి సమస్యలపై దృష్టి కేంద్రీకరించి పమరొక్కసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు రాష్ట్ర నాయకులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జాయిన్పల్లి శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాదిరెడ్డి, అచ్చన్న, మేడి కోటేష్, మంగు నరసింహారావు, సోమ నరసయ్య, కౌన్సిలర్లు వంగేటి సుచరిత, భోజన శారద, బెల్లంకొండ కిరణ్, కోల్లోజు శ్రవణ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణచారి, ఉడత భాస్కర్, బట్టు క్రాంతి, నామోజీ రాజు, నానంచర్ల స్వప్న, కొలిచిలీమా మల్లికార్జున్, నాగరాజు, ఎంగి సాయి ప్రసాద్, ఎదగాని సంతోష్, పెంట బోయిన నాగరాజు, గాయపాక పృథ్వి, ఎంగి ప్రేమలత, బొల్లారం మధు, రావుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.