చీపురుపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
చీపురుపల్లి మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పట్టణంలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, ప్రజల తరపున తాము రక్షణ కల్పిస్తామని ఎస్ఐ పి ఉమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పట్టణంలోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా