శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలి : నగర కమిషనర్
గుంటూరు : శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు వేగావంతం చేయాలని, నిర్మాణ పనులకు వీలుగా ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్ తో సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులను పరిశీలించి, జిఎంసి వైపు నుండి పనుల వేగావంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వంతెన నిర్మాణ పనులను వేగంగా చేపట్టేలా కాంట్రాక్టర్ కార్మికులను అందుబాటులో తెచ్చుకోవాలన్నారు. ఇప్పటికే వంతెన ప్రభావి తమయ్యే వారిలో అధిక శాతం యజమానులు ఆమోదం తెలిపగా, సదరు నిర్మాణాలను తొలగించడం జరిగిందన్నారు. వారికి నష్ట పరిహారం చెల్లించామన్నారు. మిగిలిన వారు ముందుకు వస్తే వంతెన పనులు త్వరితగతిన పూర్తీ అవుతాయని తెలిపారు. యజమానుల అనుమానాలు నివృత్తి చేసేలా ఎప్పటికప్పుడు వారితో పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పనుల వలన ప్రజల రాకపోకలకు అడ్డుగా లేకుండా రోడ్ ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి రెహ్మాన్, పట్టణ ప్రణాళిక సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
సూర్య నాయక్