ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం అందించిన ప్రజా సేవకుడు
ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం అందించిన ప్రజా సేవకుడు
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన ప్రజా సేవకుడు బోయ మల్లికార్జున ఆలయ నిర్మాణానికి రూ.25 వేలు విరాళం అందించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకాలోని బూదుగుంప క్యాంపులో శ్రీశ్రీ మంకాళమ్మ దేవి నూతన ఆలయ నిర్మాణానికి మల్లికార్జున తనవంతుగా ఆర్థిక సాయం చేశారు.
భక్తి, సేవాభావంతో ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.