గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలు సద్వినియోగపరచుకుంటే అనంత జ్ఞానం
వింజమూరు, మేజర్ న్యూస్ : గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలుగా వాటిని సద్వినియోగపరుచుకుంటే అనంత జ్ఞానాన్ని పొందవచ్చని ప్రసన్న కుమారి నీలిమ భార్గవి ప్రవీణ హజరత్ మ్మ లు తెలిపారు 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం గ్రంథాలయాధికారి జ్యోతి కొండయ్య ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవకార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ముందుగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు యువత గ్రంథాలయాలను సక్రమంగా సద్వినియోగపరుచుకుంటే అనంతమైన విజ్ఞానాన్ని పొందవచ్చు అని తద్వారా ఉన్నత శిఖరాలను పొందేందుకు వీలుగా ఉంటుందన్నారు గ్రంధాలయాలలోని ఉత్తమ గ్రంథాలను ఎంపిక చేసుకుని చదవడం చేసినట్లయితే జీవితం ఉజ్వలంగా ఉంటుందని తెలిపారు అవునా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగపరచుకొని తమ జీవితాలను బంగారమయం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు తదితరులు ఉన్నారు.