ఆదిత్య కళాశాలలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు జయంతి
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆదిత్య కళాశాలలో ఘనంగా స్త్రీ శక్తి దివస్
ఏలూరు, మేజర్ న్యూస్: సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని స్త్రీ శక్తి దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వంగ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలు, దేశభక్తి, పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. మహిళా సాధికారతతోనే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ABVP జిల్లా కన్వీనర్ జస్వంత్ మాట్లాడుతూ, ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చూపిన వీరోచిత పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. మహిళల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం, దేశభక్తి భావాలను పెంపొందించడమే స్త్రీ శక్తి దివస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఫణికుమార్, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ కె. హరిబాబు, కల్చరల్ కోఆర్డినేటర్ సౌభాగ్యలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా శక్తి, ఆత్మగౌరవం, ధైర్యం, దేశభక్తి సందేశంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.