మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
నల్లగొండ టౌన్ , మేజర్ న్యూస్ :పట్టణంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి m క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ పలువురు కార్పొరేటర్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా నాయకులు ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను, దేశ అభివృద్ధికి ఆమె అందించిన విశేష కృషిని స్మరించుకున్నారు
ఇందిరాగాంధీ ఆశయాలు, సిద్ధాంతాల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, రేగట్ట లింగస్వామి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల కోటి, ముత్తినేని నాగేశ్వరరావు, ఏదుళ్ళ మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, చింతపల్లి గోపాల్, పెరిక చిట్టి, మహమ్మద్ బాబా,పెరిక అంజయ్య, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు