ఆత్మకూరులో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలంలో ఎంపీటీసీ సభ్యులుగా ఇటీవల విజయం సాధించిన వారి చేత గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో వపి వో వై కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆత్మకూరు మండలంలో 9ఎంపిటిసి స్థానాలకు గాను మహిమలూరు లో వైసీపీ అభ్యర్థి మిగతా ఎనిమిది చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. గురువారం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ మెంబర్లుగా అప్పారావుపాలెం ఎంపిటిసి నెంబర్ బొమ్మ తోటి ఇందిరమ్మ, బట్టేపాడు ఎంపీటీసీ మెంబర్ వీర దిమ్మ గీతమ్మ, చెర్లో ఏడవల్లి ఎంపిటిసి నెంబర్ కేత వేణుగోపాల్ రెడ్డి, పడకండ్ల ఎంపీటీసీ మెంబర్ కొల్లి నరసయ్య నాయుడు, నువ్వురుపాడు ఎంపీటీసీ మెంబర్ షేక్ ఖాజావలి, వాశిలి ఎంపీటీసీ మెంబర్ మామిడి చందన, కరటంపాడు ఎంపిటిసి మెంబర్ దావసుమన్య, మురుగుళ్ల ఎంపీటీసీ మెంబర్ పువ్వాడ వెంకటేశ్వర్లు, మహిమలు ఎంపిటిసి మెంబర్ శ్యామనబోయిన సుజాత చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో పి. రఫీ ఖాన్,తాసిల్దార్ పి. పద్మజాకుమారి పాల్గొన్నారు.