BREAKING
పెదపులివర్రు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం.. నూతన పెన్ష పత్రాలుపంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా ఆటల పోటీలు ధర్నాల పేరుతో టిడిపి నేతలు డ్రామాలు చేస్తున్నారు... ఎన్నికల్లో జరిగిన అరాచకాలను పక్కదారి పట్టించేందుకు నిరసనలు.. బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు చింతర్లపల్లి ఎంపీటీసీ గా ప్రమాణస్వీకారం చేసిన చెన్నకేశవులు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ధాన్యం అమ్ము కొండి ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు

రైతులకు మరింత చేరువ కానున్న సహకార సేవలు... - తుర్కలమద్దికుంటలో నూతన పీఏసీఎస్‌ ఏర్పాటు.. - ఘనంగా సంబరాలు

Select Suryaa Now
రైతులకు మరింత చేరువ కానున్న సహకార సేవలు...  - తుర్కలమద్దికుంటలో నూతన పీఏసీఎస్‌ ఏర్పాటు.. -  ఘనంగా సంబరాలు

 

సూర్య - పెద్దపల్లి రూరల్‌ : పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ఏర్పాటు కావడంతో గ్రామ ప్రజలు, రైతులు సంబరాలు జరుపుకున్నారు. తుర్కలమద్దికుంట  చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
నూతన పీఏసీఎస్‌ పరిధిలో గోపాయ్యపల్లి, పాలితం, కసులపల్లి, తుర్కలమద్దికుంట, నిట్టూరు, నిమ్మన్‌పల్లి, పెద్దకల్వల, పెద్దబొంకూర్‌, దస్తగిరిపల్లి, కొత్తపల్లి గ్రామాలను చేర్చారు. ఈ సంఘం ఏర్పాటుతో ఆయా గ్రామాల రైతులకు సహకార సేవలు మరింత చేరువ కానున్నాయని, వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. పీఏసీఎస్‌ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేసిన ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుకు పెద్దపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యాల నరేష్‌ ముదిరాజ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ గోగు రాజయ్య, ఉపసర్పంచ్‌ ముత్యాల తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్‌ రాజేశం గౌడ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ప్రసన్న రాజబాబు, మాజీ సర్పంచ్‌ వెంకటి, మాజీ ఎంపీటీసీ తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.