యశోదలో తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక చికిత్స -తుంటి ఎముక చికిత్సలో యశోద నయా టెక్నాలజీ -సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్
సూర్య - పెద్దపల్లి:
తుంటి ఎముక విరుపులకు అత్యాధునిక వైద్య విధానాలతో పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే మెరుగైన చికిత్స అందించవచ్చని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్రిజేష్ కిడియూర్ తెలిపారు.గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక విరుపుల చికిత్సలో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతను వివరించారు.సాధారణంగా తుంటి ఎముక విరిగినప్పుడు కీలును పూర్తిగా మార్చడం లేదా ఎముకను తిరిగి అతికించడం అనే రెండు మార్గాలు ఉంటాయని,అయితే కీలు మార్పిడి శస్త్రచికిత్స పెద్దది కావడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరగడంతో పాటు ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.ఈ సమస్యలకు పరిష్కారంగా ఎముకలు బలహీనంగా ఉన్నవారికి పీఎఫ్ఎన్ఏ విత్ సిమెంట్ ఆగ్మెంటేషన్ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.ఈ విధానంలో చిన్న రంధ్రం ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమమైన జాన్సన్ అండ్ జాన్సన్ టైటానియం రాడ్‌ను అమర్చి, ఎముక బలహీనంగా ఉన్న చోట బోన్ సిమెంట్ నింపడం ద్వారా గట్టి పట్టు వచ్చేలా చేస్తామని వివరించారు.చాలా తక్కువ సమయంలో, ఎలాంటి రిస్క్ లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స ద్వారా రోగులు ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు నుంచే మంచంపై కూర్చోవడమే కాకుండా, కాలకృత్యాలు తీర్చుకోవడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చని బ్రిజేష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణరావు పాల్గొన్నారు.