ఈ నెల 22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ మహాసభ… వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహణకు ఏర్పాట్లు - స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య
సూర్య - పెద్దపల్లి, :
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఈ నెల 22న పెద్దపల్లిలోని ఆర్.ఆర్. గార్డెన్‌లో 'స్వర్ణోత్సవ మహాసభ'ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడిపల్లి బాపయ్య తెలిపారు.గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో
సర్వోత్సవ మహాసభ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మామిడిపల్లి బాపయ్య కుక్క అశోక్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెయ్యి మంది ప్రతినిధులతో ఈ వేడుకలు జరగనున్నాయి. గడిచిన 50 ఏళ్లుగా దళిత, బహుజన, అణగారిన వర్గాల హక్కుల కోసం సంఘం అలుపెరగని పోరాటం చేసిందని ఆయన కొనియాడారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ సంఘాల సహకారంతో నిర్వహిస్తున్న ఈ సభకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఐఏఎస్ అధికారి నరహరి, ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.ఈ మహాసభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు బొంకూరి మధు, మైస రాజేష్, కుక్క అశోక్, పాల రాజేశం, బోసెల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.