BREAKING
పెదపులివర్రు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం.. నూతన పెన్ష పత్రాలుపంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా ఆటల పోటీలు ధర్నాల పేరుతో టిడిపి నేతలు డ్రామాలు చేస్తున్నారు... ఎన్నికల్లో జరిగిన అరాచకాలను పక్కదారి పట్టించేందుకు నిరసనలు.. బీటెక్ రవి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు చింతర్లపల్లి ఎంపీటీసీ గా ప్రమాణస్వీకారం చేసిన చెన్నకేశవులు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ధాన్యం అమ్ము కొండి ఏఎస్ పేటలో ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకారం దేవుపల్లి లో బ్రహ్మోత్సవాలు.. - వాల్ పోస్టర్ ఆవిష్కరణ .... పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు పులివెందులలో వైసిపి రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది.. పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి ఎంపీపీ,వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపిన నేతలు

ఘనంగా ఎంపిపి, వైస్ ఎంపిపిల ప్రమాణ స్వీకారోత్సవం

Select Suryaa Now
ఘనంగా ఎంపిపి, వైస్ ఎంపిపిల ప్రమాణ స్వీకారోత్సవం

బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్  :  మండలంలో ఇటీవల జరిగిన ఎంపిటిసి ఎన్నికలలో 11 స్థానాల లో గెలిచిన అభ్యర్థులలో ఎంపిపి, వైస్ ఎంపిపి ల ఎంపిక, స్వీకారోత్సవం గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సోమ్లా నాయక్, ఎంపిడిఓ ఎస్ రంతుల్లయ్య ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 8 స్థానాలలో టిడిపి అభ్యర్థులు గెలవగా, ఒక స్థానంలో బిజెపి, ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానంలో వైసిపి అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో దామరమడుగు 1లో గెలిచిన దారా అన్నపూర్ణను ఎంపిపి గా, రేబాల1లో ఎంపిటిసిగా గెలిచిన ఆరు గుంట ఉషను వైస్ ఎంపిపి గా మిగిలిన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆర్ఓ సోమ్లా నాయక్ అందరికి డిక్లరేషన్ ఫారాలను అందజేశారు. ప్రమాణ స్వీకారోత్సవ అనంతరం పలువురు టిడిపి నాయకులు ఎంపిపిగా ఎంపికైన దారా అన్నపూర్ణను శాలువాలతో సత్కరించి ఎంపిపి స్థానంలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి ఎంపిపిగా ఎంపిక చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి, సహచర ఎంపిటిసి సభ్యులకు,టిడిపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ మండల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి సూచనలతో, జెడ్ పి టి సి సభ్యులు ఏటూరి శివరామకృష్ణారెడ్డి సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త, సీనియర్ టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బుచ్చి రెడ్డిపాలెం జడ్పిటిసి సభ్యులు ఏటూరి శివరామకృష్ణారెడ్డి, టిడిపి నాయకులు కే వి శేషయ్య, ఎరట పల్లి శివకుమార్ రెడ్డి, మోర్ల మురళి, మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎంపిపి కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.