BREAKING
జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెదక్ టూరిజం అభివృద్ధిపై ‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. డిసెంబర్ 12న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’ సెట్టూరు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన పాలబండ్ల భారతి వరి గడ్డివామి దగ్ధం..! -రూ.40 వేలు నష్టం..!! మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక జలదంకిలో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు ఐకమత్యానికి ప్రోత్సాహం.. గ్రామాభివృద్ధికి కొత్త బాట తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ బోయిని సంపత్ కు ధన్యవాదాలు తెలిపిన పిల్లి సత్యనారాయణ గౌడ్ బలిజిపేటలో ఎమ్మెల్యే విజయచంద్రకు ఘన స్వాగతం.. టీడీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ చెర్లోపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల వీరేష్ మున్సిపల్ ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థిగా గర్రె సురేష్ బాబు. అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు విద్యార్థులకు పలు పోటీలు, బహుమతులు

ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం..

Select Suryaa Now
ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం..
  • ‘ఎఫ్‌ఎఫ్‌ఎస్’ యాప్ విక్రయాలపై జేసీ ఆర్ వైశాలి ఆకస్మిక తనిఖీ!
  • ఖడ్గవలస ‘మన గ్రోమోర్’ సెంటర్‌ను సందర్శించిన జాయింట్ కలెక్టర్
  • స్టాక్ రిజిస్టర్లు,క్యూఆర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియల పరిశీలన
  • రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని ఆదేశం

గరుగుబిల్లి, సూర్య: రైతులకు సబ్సిడీ ఎరువులను పారదర్శకంగా, ఎలాంటి జాప్యం లేకుం డా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ (ఎఫ్ ఎఫ్ ఎస్) యాప్ అమలు తీరును జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.మండల పరిధిలోని ఖడ్గవలస గ్రామంలోని మన గ్రోమోర్ సెంటర్ ను జాయింట్ కలెక్టర్ సందర్శించి ఎరువుల విక్రయాల ప్రక్రియను తనిఖీ చేశారు.గ్రోమోర్ సెంటర్ లోని యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలను జాయిం ట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో చూపిస్తున్న నిల్వలకు, గోదాములో ఉన్న భౌతిక నిల్వలకు మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా అని ఆరా తీశారు.యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న తర్వాత జనరేట్ అయ్యే క్యూఆర్ కోడ్‌ను ఈ-పాస్ యంత్రంలో స్కాన్ చేసి ఎరువులు పంపిణీ చేస్తున్న విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.రైతుల ఆధార్, భూమి విస్తీర్ణం ఆధారంగానే సబ్సిడీ ఎరువులు అందించాలని అధికారులకు తెలియజేశారు.కృత్రిమ కొరత సృష్టించి నా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందించేందుకు ప్రభుత్వం నూతనంగా ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నా రు.ఈపరిశీలనలో మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న, సంతోషపురం రైతు సేవా కేంద్రం అగ్రిక ల్చర్ అసిస్టెంట్ ఏ హరీష్ తదితరులు పాల్గొన్నారు.