జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి.
బాపట్ల, మేజర్‌న్యూస్ :
నేడు జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు ను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, సమావేశ మందిరంలో వసతులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత జడ్పీ సి ఈ ఓ కు సూచించారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి సి.హెచ్. విజయలక్ష్మి, పంచాయతీ రాజ్ జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.