BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

విద్యార్థులకు పలు పోటీలు, బహుమతులు

Select Suryaa Now
విద్యార్థులకు పలు పోటీలు, బహుమతులు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గురువారం భారతదేశ మహిళా ప్రధానమంత్రి దివంగత  ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. శాఖా గ్రంధాలయ భవన దాతలు స్వర్గీయ  దోర్నాధుల సుబ్బమ్మ రామిరెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.పట్టణంలోని మేధా, ప్రగతి, శ్రీనివాస, గాయత్రి, జడ్పీ గర్ల్స్ హైస్కూల్ మరియు వెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ చెందిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల వారీగా వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్, క్విజ్ తదితర పోటీలు నిర్వహించి విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా వ్యక్తిత్వ వికాస గ్రంథములను బహుమతులుగా ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశుసంవర్ధక శాఖ ఏ .డి . డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి, శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏ .నరసింహారెడ్డి, తెలుగు భారతి సేవా సమితి సభ్యులు కొల్లా వెంకటేశ్వర్లు, ఓ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ లైబ్రేరియన్ ఏ.గోవింద్ రెడ్డి, పాఠశాలల కరస్పాండెంట్స్ టి.సి.హెచ్.సుబ్బయ్య, రామ్మోహన్ రెడ్డి మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విచ్చేసి ఉపన్యసించారు. విద్యార్థి దశ నుండి గ్రంథాలయ పుస్తకాలను చదవడం అలవాటుగా మార్చుకొని మేధస్సును పెంపొందించుకోవాలని విద్యార్థులకు వక్తలు తెలియజేశారు. ఇన్చార్జి లైబ్రేరియన్ ఓ.శ్రీనివాసరాజు మాట్లాడుతూ గ్రంథాలయాల ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం గ్రంథాలయ యాప్ ను రూపొందించిందని తెలిపారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో సభ్యత్వాన్ని పొంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వందన సమర్పణ తో కార్యక్రమం ఘనంగా ముగిసింది.