గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు.
గురువారం,పిట్లలవానిపాలెం మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయమును జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సందర్శించారు. కార్యాలయంలో నిర్వహించిన కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల, సభ్యుల హాజరు, సమావేశం నిర్వహణ పై మండల రిటర్నింగ్ అధికారిని ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పి.వి పాలెం మండలంలోని అల్లూరు గ్రామపంచాయతీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి విస్తృతంగా పర్యటించారు. ఆ పంచాయితీ పరిధిలో 12 వార్డులకు ఎన్నికల నిర్వహణ కొరకు ఏర్పాటుచేసిన 12 పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఆయన పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రంలో వార్డు, పోలింగ్ స్టేషన్ నెంబరు వివరాలను మార్కింగ్ చేయకపోవుటకు కారణాలపై ఆయన ఆరా తీశారు.పంచాయతీలో సమస్యాత్మక మరియు తీవ్ర సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఏమీ లేవని అధికారులు ఆయనకు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలని ఆయన అధికారులకు తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు కట్టుతదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో పి.వి పాలెం రిటర్నింగ్ అధికారి పద్మజ, తహసిల్దార్ డి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శేఖర్, డిప్యూటీ ఎంపీడీవో కె.వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.