BREAKING
ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం

పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్

Select Suryaa Now
పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్
  • వైస్ ఎంపీపీ గా సాలూరు వెంకటలక్ష్మి,

పాచిపెంట, సూర్య: పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు తెలుగు దేశం పార్టీకి చెందిన 9 మంది ఎంపీటీసీలు చేతులెత్తి తమ మద్దతు తెలిపారు. ఆయన గురువారం మధ్యాహ్నం ఎంపీపీ పీఠాన్ని అధిష్టించారు.వైస్ ఎంపీపీగా పాచిపెంట రెండవ సెగ్మెంటు లో గెలుపొందిన  సాలూరు వెంకట లక్ష్మి కి సభ్యులు ఎన్నుకున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి రాధాకృష్ణ 14 మంది ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక జరిపారు. ముందుగా సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ ఎన్నికల అధికారికి విప్ జారీ చేశారు. ఎంపీపీ అభ్యర్థిగా గూడెపు యుగంధర్ ను ప్రతిపాదిస్తూ సభ్యులు రిటర్నింగ్ అధికారికి కాగితాలు అందజేశారు. మిగతా సభ్యులంతా యుగంధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీని కూడా ఎంపిక చేశారు. వైయస్సార్ పార్టీకి చెందిన పాచి పెంట వన్ సెగ్మెంట్ అభ్యర్థి డోల బాబ్జి తో పాటు మరో ముగ్గురు ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు.

  • మండలాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తా 

గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చలవ, మండల ప్రజల ఆశీస్సులు, తోటి ఎంపీటీసీలు ఆశీస్సులు తో తాను ఎంపీపీగా పీఠం ఎక్కానని  మండల ప్రజానీకానికి రుణపడి ఉంటానని పాచి పెంట మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రజల సహాయ సహకారాలు అందించాలని ఎంపీపీ యుగంధర్ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.