BREAKING
వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి ఒరిస్సా కి చెందిన 7 గురు కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి – DBRC కృషితో కదిలిన అధికార యంత్రాంగం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం

కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ

Select Suryaa Now
కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ

సూర్య బోయినపల్లి.. మండలం కొదురుపాక గ్రామంలో దారుణ దోపిడీ చోటుచేసుకుంది. ఆరోగ్యం కోసం మాత్రలు ఇస్తామని నమ్మించి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు, ఒంటరిగా ఉన్న వృద్ధురాలు బొంగోని రాజవ్వ నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలోని తులం బంగారు ఆభరణాన్ని అపహరించి పరారయ్యారు.వివరాల్లోకి వెళితే... కొదురుపాక గ్రామానికి చెందిన బొంగోని రాజవ్వ ఇంటికి  రాత్రి సమయంలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు వచ్చారు. తాము ఆరోగ్యానికి సంబంధించిన మాత్రలు ఇవ్వడానికి వచ్చామని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం హఠాత్తుగా రాజవ్వపై దాడి చేసి, ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కదలకుండా చేసి, మెడలో ఉన్న తులం బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.ఈ ఘటనలో రాజవ్వ భయాందోళనకు గురై అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని వేములవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.సమాచారం అందుకున్న బోయిన్‌పల్లి ఎస్సై రమాకాంత్ ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.గుర్తుతెలియని వ్యక్తులు మాత్రలు, మందులు, సర్వే పేరుతో ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే వెంటనే అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.