BREAKING
శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్

_ముఖ్యమంత్రి పర్యటన పేరుతో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులా

Select Suryaa Now
_ముఖ్యమంత్రి పర్యటన పేరుతో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులా

కోహెడ ; సిద్దిపేట జిల్లాకు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే కోహెడ మండలంలో బీజేపీ నాయకులను తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టులు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు తమ నిరసనను తెలియజేసే హక్కు లేదా? ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నేరమా ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రజాపాలన? ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష గొంతుకలను అణచివేయాలని చూడటం సరికాదు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు తెల్లవారుజామున కోహెడ మండలంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 1. ఖమ్మం వేంకటేశం – బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి 2. పేర్యాల సాగర్ రావు – బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి 3. గుగ్గిళ్ల శ్రీనివాస్ – బీజేపీ మండల సోషల్ మీడియా కన్వీనర్, వార్డు మెంబర్ 4. కంది సత్యనారాయణ రెడ్డి – బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు, వార్డు మెంబర్ 5. కక్కర్ల దామోదర్ గౌడ్ – బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ మండల అధ్యక్షుడు, వార్డు మెంబర్ ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను ఎన్ని అరెస్టులు చేసినా అణచలేరు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాం.