BREAKING
బాచుపల్లి ప్లాట్ల ఈ-వేలంలో HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత..

సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు

Select Suryaa Now
సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు
  • పార్టీ పరంగా విచారణ జరపాలి
  • వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి డిమాండ్

పాచిపెంట, సూర్య: సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారాని వైయస్సార్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పాచిపెంట 1వ సెగ్మెంట్ ఎంపీటీసీ డోల బాబ్జి తమ స్వంత పార్టీ నాయుకులు పై ఆరోపణలు చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి మండల నాయకులు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మిగతా ఎంపీటీసీలతో మండల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై వైసిపికి వెన్నుపోటు పొడిచారని అందుకే ఓడిపోయామని బాబ్జి పేర్కొన్నారు. పార్టీపరంగా విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందిన కాడికి  బోంచేయడం తప్ప పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ ముందుకు రారని ఆరోపణలు చేశారు. కుమ్మక్కు రాజకీయము తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గర లోపాయికారంగా అవినీతికి పాల్పడి సొంత పార్టీకి వెన్నుపోటు పొడవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని, అటువంటి వారిని పార్టీలో లేకుండా చర్యలు తీసుకోవాలని బాబ్జి తో పాటు మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, వైసిపి నాయకులు మాదిరెడ్డి మధుసూదనరావు కోరారు. రానున్న పంచాయతీ ఎన్నికల తర్వాత పార్టీకి ద్రోహం చేసిన వారి పేర్లు బయట పెడతానని హెచ్చరించారు. అటువంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తాను ఊరుకునేదే లేదన్నారు. ఈ సమావేశంలో నూతన ఎంపీటీసీలు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు.