గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయకుండా సిద్దిపేట అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే అక్రమ అరెస్టుల
కోహెడ ; కోహెడ మండలం బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెరుగు నరేందర్ రెడ్డి బిఆర్ఎస్ వి నాయకులు జాలిగం శంకర్ ఎండి సైపోద్దీన్ మాంకాల రమేష్ కళ్లికోట రాహుల్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయకుండా
సిద్దిపేటలో మధ్యలోనే నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి రూ.1,070 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేసినందుకు తెల్లవారుజామునే బిఆర్ఎస్ వి నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమే!అభివృద్ధి కోసం ప్రశ్నించడం తప్పా?
ప్రజల తరఫున గొంతెత్తడం నేరమా?
నిధులు అడిగితే అరెస్టులు చేస్తారా?
గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి అరెస్టులతో మా గొంతును నొక్కలేరు. సిద్దిపేట జిల్లా అభివృద్ధి కోసం, ప్రజల హక్కుల కోసం మా పోరాటం ఆగదు!ఖబడ్దార్ రేవంత్ రెడ్డి!
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పండి… అరెస్టులతో కాదు, నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసి నిరూపించండి!సిద్దిపేట అభివృద్ధి మా హక్కు – మా పోరాటం ప్రజల కోసం! ప్రశ్నిస్తాం అన్నారు.