జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుంది. అందుకు సంబంధించి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.మధుసూదన్ ఆధ్వర్యంలో తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియకు సంబంధించి డిప్యూటీ సీఈవో వై. బ్రహ్మయ్య, సిబ్బంది తగు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకోవాల్సి ఉంది. అందులో భాగంగా నెల్లూరు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ను కూడా ఎన్నుకోనున్నారు. నెల్లూరు జిల్లాలోని 35 మండలాలకు సంబంధించి 35 మంది జడ్పిటిసిలు ఉండగా మెజార్టీ సభ్యులు కూటమి పార్టీకి చెందిన వారు కావడంతో జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కి చెందిన జడ్పిటిసిని జడ్పీ చైర్మన్ గా మిగతా సభ్యులు ఎన్నుకోనున్నారు. అదేవిధంగా గతంలో ఇద్దరు వైస్ చైర్మన్ ఉండగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక వైస్ చైర్మన్ మాత్రమే ఉండే విధంగా ఉత్తర్వులు ఇవ్వడంతో ఒక వైస్ చైర్మన్ మాత్రమే ఎన్నుకోనున్నారు. ముందుగా జడ్పిటిసి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి అనంతరం జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ గా ఇందుకూరుపేట జడ్పిటిసి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రేస్ లో ఉండగా ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే దుత్తలూరు జడ్పిటిసి కంభంవిజయరామిరెడ్డి, ఆత్మకూరు జడ్పిటిసి తూమాటి శశిధర్ రెడ్డి పేర్లు వినస్తున్నాయి. అయితే ఇందుకూరుపేట జడ్పిటిసి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ల మద్దతు ఉండడంతో ఎక్కువ శాతం జడ్పీ చైర్మన్ గా పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డికే ఎన్నుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద శుక్రవారం తెలుగుదేశం పార్టీ నుండి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎవరన్నది తెలియనుంది.