BREAKING
బాచుపల్లి ప్లాట్ల ఈ-వేలంలో HMDAకు రూ.55.43 కోట్ల ఆదాయం దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత..

మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం

Select Suryaa Now
మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లి మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపిపి)గా తెలుగుదేశం పార్టీకి చెందిన బీదం గురునాథ్ యాదవ్,వైస్ ఎంపీపీగా మాకినేని చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు గురువారం ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్ లక్ష్మీ ప్రసన్న,ఎంపీడీవో తాజ్ మాస్రూర్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరుగగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అధికారుల చేతుల మీదుగా డిక్లరేషన్ అందుకున్న బీదం గురునాథ్ యాదవ్,మాకినేని చంద్రశేఖర్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయం వెలుపల కోళ్లబైలు టిడిపి ఇంచార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఎంపీపీ,వైస్ ఎంపీపీలను గజమాల,శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రతిఫలం ఉంటుందన్నారు.బీదం గురునాథ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని,ఎమ్మెల్యే షాజహాన్ బాషా వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.ఎంపీపీ గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మదనపల్లి మండలం అభివృద్ధి గతంలో పయనిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కోళ్లబైలు ఎంపీటీసీ మోహన్ రెడ్డి,డి
.రమేష్ రెడ్డి,శ్రీనాథ్,కొత్తిండ్లు దొరస్వామి నాయుడు,నట శేఖర్,రెడ్డి రాయల్,ఖాదర్,నయాజ్,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి