BREAKING
ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా 125 పుస్తకాలు అందించిన యద్దనపూడి ఎంఈఓ గోపి : అభినందించిన జిల్లా కలెక్టర్. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తక్షణ స్పందన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది..... వైసీపీ ఎంపీటీసీలకు ఘన సన్మానం కొదురుపాక లో వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం చోరీ దేశం అభ్యర్థికి బి ఫారం

'సూర్య’ అక్షరం...నిజమైంది!

Select Suryaa Now
'సూర్య’ అక్షరం...నిజమైంది!
  • వైస్ ఎంపీపీగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం
  • సీనియార్టీకే ప్రాధాన్యం ఇచ్చిన టిడిపి అధిష్టానం
  • ముందే పసిగట్టి కచ్చితమైన కథనం అందించిన ‘సూర్య’ విలేకరి
  • నిజమైన విశ్లేషణతో పాఠకులు, రాజకీయ వర్గాల్లో పెరిగిన విశ్వసనీయత

గరుగుబిల్లి, సూర్య: స్థానిక రాజకీయ పరిణామాల ను ముందే అంచనా వేయడంలో ‘సూర్య’ దినపత్రిక మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.గరుగుబిల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీ (ఉపా ధ్యక్ష) పదవికి తెలుగుదేశం పార్టీ తరఫున అంబటి తవిటినాయుడు (రాంబాబు)పేరును అధిష్టానం ఖరారు చేస్తుందని ‘సూర్య’ విలేకరి గతంలోనే కచ్చితమైన సమాచారంతో వార్తను ప్రచురించడం జరిగింది.తాజాగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధికారి కంగా ఆయన పేరునే ప్రకటించడంతో ‘సూర్య’ రాసిన అక్షరం నూటికి నూరు శాతం నిజమైంది. మండల పరిషత్
వైస్ ఎంపీపీ పదవి కోసం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన పార్టీ నుంచి పలువురు నాయకులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై మండలంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో ‘సూర్య’ విలేకరి తనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో పాటు స్థానిక రాజకీయ సమీకరణాలను విశ్లేషించారు.పార్టీ విధేయత,సీనియార్టీ  దృష్ట్యా అంబటి రాంబాబు వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని ముందే స్పష్టం చేస్తూ ప్రత్యేక కథనాన్ని అందించారు. అధిష్టానం నిర్ణయం వెలువడిన వెంటనే మండలంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ‘సూర్య’ కథనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. గాలి వార్తలకు తావివ్వకుండా, వాస్తవా లను ముందే ప్రజల ముందుంచిన ‘సూర్య’ విలేకరి పనితీరును పలువురు రాజకీయ విశ్లేషకులు, స్థానిక నాయకు లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.ఈ పరిణామంతో మండలంలో ‘సూర్య’ పత్రిక విశ్వసనీయత మరింత రెట్టిం పైంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పని చేస్తున్న అంబటి రాంబాబుకు సముచిత స్థానం కల్పించడం పట్ల టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈసందర్భంగా అంబటి రాంబాబు పేర్కొన్నారు.వైస్ ఎంపీపీగా అంబటి తవిటినాయుడు (రాంబాబు) బాధ్యతలు స్వీకరించడం పట్ల పలువు రు టిడిపి నాయకులు అభినందనలు తెలియజేశారు.