దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో ధాన్యం అమ్ము కొండి
మర్కుక్ : రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకే విక్రయించాలని మర్కుక్ తహసిల్దార్ సరిత, సర్పంచ్ సత్తెమ్మ రమేష్ సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని భవనందాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హేమలత సంతోష్, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి భానుప్రియ, స్థానిక ప్రజాప్రతినిధులు, సత్యనారాయణ రెవెన్యూ సహకార శాఖ అధికారులు, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.