ఒరిస్సా కి చెందిన 7 గురు కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి – DBRC కృషితో కదిలిన అధికార యంత్రాంగం.
చినగంజాం, మేజర్‌న్యూస్ :
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఇచ్చిన సమాచారం మేరకు చీరాల రెవిన్యూ డివిజన్ అధికారి ఆదేశాలతో చినగంజాం తాసిల్దార్ జీవి గుంట ప్రభాకర్ రావు మరియు ఎస్సై సురేష్ సంయుక్తంగా ఒరిస్సా కి చెందిన 7 గురు వెట్టిచాకిరి (బాండెడ్ లేబర్) కార్మికులకు విముక్తి కల్పించడం జరిగింది. ఒరిస్సాకు చెందిన ఏడుగురు గిరిజన కుటుంబాలకు చెందిన కార్మికులు చిన్నగంజాం లో రొయ్యల చెరువుల యజమాని వద్ద పనికి ఏడుకొండల రెడ్డి అనే వ్యక్తి పనికి పెట్టడం జరిగింది గత తొమ్మిది నెలలుగా వీరికి సరిగా వేతనాలు ఇవ్వకపోవడం ఇంటికి వెళ్తామన్న పంపించకపోవడం తో వారు ఇండియన్ లేబర్ లైన్ మరియు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC) తను ఆశ్రయించడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ లు విషయాన్ని చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి తీసుకురావడంతో ఆ కార్మికులను సురక్షితంగా తక్షణమే తీసుకురావాలని ఆదేశించారు. అందించిన చిన్నగంజాం తాసిల్దార్ జివిగుంట ప్రభాకర్ రావు స్థానిక ఎస్సై తో కలిసి వారు పని చేస్తున్న రొయ్యల చెరువులు వద్దకు వెళ్లి వారికి భరోసాను కల్పించి యజమాని వద్ద నుండి వారికి రావలసిన డబ్బులను ఇప్పించి వారిని సురక్షితంగా వారి నివాసాలకు పంపించడం జరిగింది. నిర్బంధ కార్మికులను రక్షించిన తాసిల్దార్ కృషిని ఆర్డీవో నరసింహారావు అభినందించారు. ఎన్నికల విధుల పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తమ విజ్ఞప్తి మేరకు తక్షణం స్పందించిన తాసిల్దార్ కు డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ వేము భగవాన్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యం ఎలిజబెత్ డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ వేము భగవాన్ దాస్ ఇండియన్ లేబర్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఇర్షాద్, ప్రతినిధులు మిక్కిలి సురేష్ బాబు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.