ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు. :
సూర్య ముధోల్ మండలం. :
ముధోల్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేశారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రేమ్‌నాథ్ రెడ్డి, పతంగి కిషన్, అజీజ్, దిగంబర్, యాదవ్, గోవింద్ పటేల్, పల్లె నాగేష్ తదితరులు పాల్గొన్నారు.