ఎంపీపీగా దేవరింటి లీలావతి ఏకగ్రీవం.. తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీ
ఎంపీపీగా దేవరింటి లీలావతి ఏకగ్రీవం..
తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19:
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీన్ని) అంజనమ్మ (తంబళ్లపల్లె) భూదేవి ( ఎద్దుల వారి పల్లి) రవీంద్ర నాయక్ ( కోటకొండ) హరి కుమార్ రెడ్డి (కోసువారిపల్లి) నరసింహులు (బాలిరెడ్డిగారిపల్లి) భాస్కర్ (గుండ్లపల్లి) గాయత్రి (కొటాల) సుశీల (కుక్కరాజుపల్లి)చే ఆర్ఓ శ్రీధర్, ఎంపీడీవో ఉషారాణి, తాసిల్దార్ శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రెడ్డిమల్ రెడ్డి, హరి కుమార్ రెడ్డి లు ఎంపీపీగా లీలావతి, ఉపాధ్యక్షురాలుగా భూదేవి, ప్రత్యేక ఆహ్వానితుడిగా దేవరింటి రవిశంకర్ రెడ్డి లను ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్ ఓ ఎంపీపీగా లీలావతి, ఉపాధ్యక్షురాలుగా భూదేవి, ప్రత్యేక ఆహ్వానితుడిగా రవిశంకర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక వాయిదా పడింది. ఈ సందర్భంగా ఎంపీపీ లీలావతి ప్రమాణ స్వీకారం చేసి తంబళ్లపల్లె మండల అభివృద్ధే ధ్యేయంగా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, పెద్దిరెడ్డి అభినయ్ రెడ్డి,వైకాపా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీపీ లీలావతికి అభినందనల వెల్లువ ః
తంబళ్లపల్లె ఎంపీపీగా ఎన్నికైన దేవరింటి లీలావతి కి వైకాపా నాయకులు, కార్యకర్తలు దుశ్యాలువలు, పూల మాలలు వేసి అభినందనల వెల్లువ కురిపించారు. పెద్దిరెడ్డి అభినయ రెడ్డి, దేవరింటి కుటుంబ సభ్యులు, జడ్పిటిసి సందప్ప, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చౌడేశ్వర, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ లీలా రవిశంకర్ రెడ్డి ని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీలు ఎంవి ప్రసాద్, మారుతీ కుమార్, ఏవో థామస్ రాజా, సురేంద్ర, గోపీనాథ్,విజయ్, ఖయ్యూం, కార్యదర్శులు పాల్గొన్నారు. ఎస్సై టి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు.
రిపోర్టర్: గౌరీ శంకర్, తంబళ్లపల్లి