andhrapradesh
కొత్తవలస ఎంపీపీగా కోళ్ల రమణమ్మ
- వైస్ ఎంపీపీగా లాలం భారతీ ఏకగ్రీవ ఎన్నిక
కొత్తవలస, సూర్య: కొత్తవలస మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) కోళ్ల రమణమ్మ, ఉపాధ్యక్షురాలిగా (వైస్ ఎంపీపీ) లాలం భారతీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు మొత్తం 20 మంది ఎంపీటీసీలకు గాను 19 మంది హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికల అధికారినూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీలతో పాటు మండలంలోని ఇతర ఎంపీటీసీ సభ్యులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా 15 మంది టీడీపీ ఎంపీటీసీలు ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులకు మద్దతు తెలపడంతో కోళ్ల రమణమ్మ, లాలం భారతీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) రవికిరణ్ అధికారికంగా ప్రకటించారు. . మండలంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు