BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

గుర్ల ఎంపీపీగా వెన్నె, వైస్ ఎంపీపీగా పొట్నూరు

Select Suryaa Now
గుర్ల ఎంపీపీగా వెన్నె, వైస్ ఎంపీపీగా పొట్నూరు
  • చీటీల పద్ధతిలో ఉత్కంఠకు తెర.. ఎంపీటీసీల నిజాయితీకి ప్రజల హ్యాట్సాఫ్!
    గుర్ల, సూర్య: గుర్ల మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వెన్నె సన్యాసినాయుడు ఎంపీపీగా ఎన్నికవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పొట్నూరు సన్యాసినాయుడు వైస్ ఎంపీపీగా ఎంపికయ్యారు. ఎంపీటీసీలు చీటీల పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో పాల్గొనడంతో మండల ప్రజలు ఆసక్తికరంగా వీక్షించారు.గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆశయ్య ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఇరు పార్టీలకు చెందిన ఎంపీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు.ఎంపీపీ పదవికి తెలుగుదేశం పార్టీ తరఫున వెన్నె సన్యాసినాయుడును, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొట్నూరు సన్యాసినాయుడును ఆయా పార్టీల సభ్యులు ప్రతిపాదించారు. ఇరు పార్టీలకు చెరో తొమ్మిది మంది సభ్యుల మద్దతు ఉండటంతో కోరం సమస్య తలెత్తింది. దీంతో ఎన్నికల అధికారి చీటీల పద్ధతిని అనుసరించారు. ఇద్దరు అభ్యర్థుల పేర్లతో చెరో  ఐదు చీటీలను వేర్వేరుగా సిద్ధం చేసి సభ్యుల సమక్షంలో బాక్సులో వేసి గులకరించగా, ఎన్నికల అధికారి ఆశయ్య ఒక చీటీ తీశారు. అందులో వెన్నె సన్యాసినాయుడు పేరు రావడంతో ఎంపీపీగా ఆయన ఎన్నికైనట్లు ప్రకటించారు.అదేవిధంగా వైస్ ఎంపీపీ ఎన్నికలోనూ కోరం సమస్య తలెత్తడంతో చీటీల పద్ధతిని అనుసరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొట్నూరు సన్యాసినాయుడును, తెలుగుదేశం పార్టీ తరఫున చింతలపేటకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి  దాసరి వనజను సభ్యులు ప్రతిపాదించారు. చీటీ తీయగా పొట్నూరు సన్యాసినాయుడు పేరు రావడంతో వైస్ ఎంపీపీగా ఆయన ఎంపికయ్యారు.ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇరు పార్టీలు క్యాంప్ రాజకీయాల నిర్వహించాయి.గుర్ల ఎంపీపీ పీఠం ఏ పార్టీకి దక్కుతుందన్న ఉత్కంఠ మండలవ్యాప్తంగా చర్చ కొనసాగింది. చివరకు ఎంపీటీసీల సమక్షంలో చీటీల పద్ధతిలో ఎన్నికలు పూర్తవడంతో ఉత్కంఠకు తెరపడింది.ఎన్నికల ప్రక్రియలో సభ్యులు ప్రశాంతంగా వ్యవహరించడంతో రెండు పార్టీలకు చెందిన   ఎంపీటీసీలు ప్రలోభాలకు తలొగ్గ కుండా   ప్రజాస్వామ్య స్ఫూర్తిని, నిజాయితీని పలువురు ప్రశంసించారు.ఎంపీపీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చీపురుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకర్రావు,గుర్ల ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు, జిల్లా ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి తేజ్ భరత్ పాల్గొని ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ ఆదిలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.