ఘనంగా శ్రీ దేవి దండుమారమ్మ 15వ వార్షికోత్సవం...
విజయనగరం, సూర్య: విజయనగరం పట్టణం కాళీఘాట్ కాలనీలోగల శ్రీ దేవి దండుమారమ్మ ఆలయ పునః ప్రతిష్ట జరిగి 15 సం.లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నవంబరు 19న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణలు,పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహం పునః ప్రతిష్ట గావించి 15 సం.లు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, చండీ పారాయణం, సహస్ర కుంకుమార్చన, చండీ హోమం, మాహా పూర్ణాహుతి నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.పద్మలత, ఎఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్ కుమార్, విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, ఎఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ ఏవీ లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, పి.శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.