రాయదుర్గం తప్పిపోయిన 7వ తరగతి బాలుడిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు!
రాయదుర్గం టౌన్ మేజర్ న్యూస్:
ఈరోజు ఇంటి నుంచి తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడిని రాయదుర్గం పోలీసులు వేగంగా స్పందించి వెతికి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు,బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు,ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. టౌన్ లోని ప్రధాన రోడ్లు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాలు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించారు. కొద్దిసేపటికే బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు తీసుకువచ్చారు,బాలుడు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించి బాలుడిని వెతికి అప్పగించిన పోలీస్ సిబ్బందికి తల్లిదండ్రులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు,పిల్లలు కనిపించకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవానంద్ సూచించారు.
సూర్య ప్రతినిధి: మహేష్ రాయదుర్గం టౌన్ రిపోర్టర్