ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు, * ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
మాడ్గులపల్లి, మేజర్ న్యూస్ :
భారత తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన దివంగత ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగాఇందిరాగాంధీ విగ్రహానికి శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, మాడ్గులపల్లి మండల కాంగ్రెస్ పక్షం అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీకి ప్రత్యేక స్థానం ఉందని,దేశ తొలి మహిళా ప్రధానమంత్రి గా బాధ్యతలు చేపట్టి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ పరిపాలనలో తనదైన ముద్ర వేశారనిగుర్తుచేశారు. బ్యాంకుల జాతీయీకరణ ద్వారా బ్యాంకింగ్ సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారని కరీబి హటావో పేరుతో ఇందిరమ్మ 20 సూత్రాలను అమలు చేసి దేశంలో సామాజిక ఆర్థిక హరిత విప్లవానికి ప్రోత్సాహం అందించడం ద్వారా దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు దోహదపడ్డారన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేశారని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళల సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. 1971 యుద్ధ సమయంలో దేశానికి నాయకత్వం వహించి బంగ్లాదేశ్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలు భారత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయనన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పక్షం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.