BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం

ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్: భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ నారపల్లిలో గురువారం ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశానికి ఆమె అందించిన సేవలను, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొంతం శంకర్ రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే. వినోద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బద్దం కుమార్, మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.