చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు
- అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా – ఎస్‌ఐ జె. రామకృష్ణ
లక్కవరపుకోట, సూర్య: విజయనగరం జిల్లా లక్కవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాఖపట్నం–అరకు ప్రధాన రహదారిపై గొలజాం జంక్షన్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్‌ఐ జె. రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం పోలీసు సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించారు.ఇటీవల జరుగుతున్న చైన్ స్నాచింగ్, చైన్ దోపిడీ ఘటనల నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేయడంతో పాటు, వాహనదారుల వివరాలు, వాహన పత్రాలను పరిశీలించారు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పట్టుకునే లక్ష్యంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.అలాగే స్థానిక ఎన్నికలు (సర్పంచ్) నేపథ్యంలో అక్రమ మద్యం డబ్బులు తరలింపు పై కూడా నిఘా ఉంచి నట్లు ఎస్ ఐ తెలిపారు ఎన్నికలు ప్రశాంతం గా నిర్వహించేందుకు అందరు సహకరించాలి అని నాయకులు ఓటర్ల కి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, వారి వ్యవహారశైలిపై పోలీసులు నిఘా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ జె. రామకృష్ణతో పాటు లక్కవరపుకోట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.