BREAKING
ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు, * ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం కొత్తవలస ఎంపీపీగా కోళ్ల రమణమ్మ ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయలేం.. రామాయణం, పైర్ రెండింటినీ చూస్తారన్న ఇంతియాజ్ అలీ! ఉక్రెయిన్‌కు 45 బిలియన్ యూరోల రుణ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్వాగతం.. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల ఆదాయంతో నిధుల సమీకరణ! రాయదుర్గం తప్పిపోయిన 7వ తరగతి బాలుడిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు! వెల్దుర్తి పారిశ్రామికాభివృద్ధి రమేష్ శెట్టితోనే సాధ్యం ​రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ​గ్రామాభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మద్దతు: బొమ్మన దశరథరామిరెడ్డి ​నా ఎదుగుదలకు టీవీ శివయ్యే కీలకం: సంజన్న గౌడు ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి.. రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా శ్రీ దేవి దండుమారమ్మ 15వ వార్షికోత్సవం... చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం

తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం

Select Suryaa Now
తె ర్లాం  ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం
  • వైస్ ఎంపీపీ గా రెడ్డి గౌరీ నాయుడు 

తెర్లాం  నవంబరు 19. మేజర్ న్యూస్ :  తెర్లాం మండల అధ్యక్షరాలు గా  వాకాడ నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి హరికృష్ణ o నాయుడు ప్రకటించారు గురువారం స్థానిక వెలుగు కార్యాలయ సమావేశ మందిరం లో జరిగిన మండల అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ వాకాడ నిర్మలను వి. చిన్నయ్య పేట ఎంపీటీసీ అల్ల బోయిన సత్య రావు ప్రతిపాదించగా కుసుమూరు ఎంపీటీసీ సిరికి గౌరేశ్వరి  బలపరిచారు. అదే విధంగా వైస్ ఎంపీపీ గా రెడ్డి గౌరీ నాయుడు ను కొరటాo  ఎంపిటిసి పల్ల జగ్గారావు ప్రతిపాదించగా తెర్లి ఈశ్వరరావు బలపరిచారు. వేరే ఎన్నిక నామ మాత్రం మాత్రమే. ప్రతిపక్ష గట్టిగా లేకపోవడంతో వైసీపీ సభ్యులు మిన్న కుండిపోయారు. తొలిత  బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ ఆర్ కేకే రంగారావు కూటమి మద్దతుదారుల ఎంపీటీసీలను సాదరంగా పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించి  అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాల నుంచి ఎన్నికల నిర్వహణ గదికి ఎంపీటీసీలు అందరూ హాజరై ఎన్నికలో పాల్గొన్నారు.  ఎన్నికల అధికారి ఒక్కొక్క ఎంపీటీసీ సభ్యుడు నుంచి ప్రమాణస్వీకారాన్ని నిర్వహించారు ఎంపీడీవో రేగి రాంబాబు సభ్యుల చేత ప్రమాణ స్వీకార పత్రాన్ని చదివించి సభని రంజింపజేశారు. అదే విధంగా 12 మంది కూటమి  మద్దతుదారుల ఎంపీటీసీ లతోపాటు ఐదుగురు వైసిపి ఎంపీటీసీలు ప్రమాణస్వీకారంలో పాల్గొని విజయవంతం చేశారు.

  • మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి
  • పలువురు అధికారులు సభ్యులకు సూచన 

ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మండల తాసిల్దార్ ఆర్ ధనం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయం సాధించిన ఎంపిటిసి సభ్యులు అధికారులతో సమన్వయంతో మండల అభివృద్ధికి దోహదపడాలని కోరారు. అదేవిధంగా ఎస్సై సాగర్ బాబు మాట్లాడుతూ మండల ప్రాదేశిక ఎన్నికలను సజావుగా జరిపించేందుకు ప్రజాప్రతినిధులు ప్రజలు సoయమనం  పాటించి పోలీసులకు తగిన సహాయ సహకారాలు అందించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎంపీడీవో పేజీ రాంబాబు మాట్లాడుతూ విజయం సాధించిన ప్రతి ఒక్క మండల  ప్రాదేశిక సభ్యుడు ఏ విధంగా ప్రమాణం చేశారో అదే కర్తవ్యాన్ని బాధ్యతను గుర్తించుకొని మండలాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాకు తోడుగాని నీడగా మీరు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఎన్నికల అధికారి హరికృష్ణ నాయుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిపించిన అధికారులకు అధికార యంత్రాంగానికి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఇలా ఎన్నికల ప్రశాంతంగా జరగడం నాకు తెలిసి  ఇంత చక్కగా జరగడం విశేషంగా భావించారు .మండల అధ్యక్ష పదవి ఎస్సీ మహిళ కేటాయించడం వలన పెరు మాలి ప్రాదేశికము ఎస్సీ మహిళ కావడంతో అక్కడి నుంచి  పోటీ చేసిన వాకాడ నర్మల ఎంపిపి బాధ్యతలు తీసుకోవడం పట్ల మండల ప్రజలు హర్షాతి రేఖలు వెల్లు విరిసాయి. ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీపీ వాకాడ నిర్మలను వైస్ ఎంపీపీ రెడ్డి గౌరీనాయుడు ను అధికారులు అనధికారులు బంధువులు స్నేహితులు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేసి విజయ పధం లో మండలాన్ని నడిపించాలని  తమ ఆకాంక్షను వెల్లడించారు.