గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
తెర్లా o సూర్య: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా భారతదేశ మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక గ్రంథాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రంధాల య అధికారి సిహెచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు .ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశ ప్రధానిగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఇందిరాగాంధీ పాత్ర కీలకమన్నారు. నాటి నుంచి ఆమె చేసిన సేవలు మహిళలకు మార్గదర్శకాలని ఆమె సేవలను కొనియాడారు. మహిళా సాధికారిక పైన ఆయన సవివరంగా అందించారు. కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పి. రమాదేవి అంగన్వాడి టీచర్ వై. శ్రీదేవి ఈ. అనసూయ బి .నర్సమ్మ బి .రామలక్ష్మి పాఠకులు విద్యార్థులు పిల్లలు పాల్గొన్నారు.