BREAKING
ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు, * ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం కొత్తవలస ఎంపీపీగా కోళ్ల రమణమ్మ ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయలేం.. రామాయణం, పైర్ రెండింటినీ చూస్తారన్న ఇంతియాజ్ అలీ! ఉక్రెయిన్‌కు 45 బిలియన్ యూరోల రుణ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్వాగతం.. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల ఆదాయంతో నిధుల సమీకరణ! రాయదుర్గం తప్పిపోయిన 7వ తరగతి బాలుడిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు! వెల్దుర్తి పారిశ్రామికాభివృద్ధి రమేష్ శెట్టితోనే సాధ్యం ​రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ​గ్రామాభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మద్దతు: బొమ్మన దశరథరామిరెడ్డి ​నా ఎదుగుదలకు టీవీ శివయ్యే కీలకం: సంజన్న గౌడు ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి.. రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా శ్రీ దేవి దండుమారమ్మ 15వ వార్షికోత్సవం... చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం

బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం

Select Suryaa Now
బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం
  • వైస్ ఎంపీపీగా ఆవు సత్యనారాయణ ఎన్నిక.. అధికార పార్టీకి వైసీపీ సభ్యుల సైతం మద్దతు
    బాడంగి, సూర్య: బాడంగి మండల పరిషత్ అధ్యక్షుడిగా గొల్లాది ఎంపీటీసీ సభ్యుడు బంటు అర్జునరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా వీరసాగరం ఎంపీటీసీ సభ్యుడు ఆవు సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇరువురి ఎన్నికకు అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులతోపాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సైతం మద్దతు పలకడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
    ఎంపీపీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులతోపాటు, జనసేన పార్టీకి చెందిన ముగడ ఎంపీటీసీ సభ్యులు, రేజేరు గ్రామానికి చెందిన స్వతంత్ర ఎంపీటీసీ సభ్యులు సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు బంటు అర్జునరావుకు మద్దతుగా చేతులెత్తారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.అదేవిధంగా వైస్ ఎంపీపీ ఎన్నికలోనూ ఆవు సత్యనారాయణకు అన్ని వర్గాల సభ్యుల నుంచి మద్దతు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సైతం ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలపడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది.
    మండల పరిషత్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం, స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక, బీఫారాల కేటాయింపు తదితర అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వారి నాయకత్వంలో పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను దక్కించుకోవడం మండల రాజకీయాల్లో టీడీపీకి కీలక పరిణామంగా నిలిచింది.
    స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి మహారాజన్ పర్యవేక్షించగా, ఎంపీడీవో డి.వి. శ్రీలత ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తయింది.
    పార్టీలకు అతీతంగా సభ్యులు మద్దతు పలకడంతో బాడంగి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.