BREAKING
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆలోచన.. బ్యాంకుల కనీస నగదు నిల్వల నిబంధన రెట్టింపు చేసే యోచన! యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆలోచన.. బ్యాంకుల కనీస నగదు నిల్వల నిబంధన రెట్టింపు చేసే యోచన! పొలం బడి కార్యక్రమంలో ఫీల్డ్ డే నిర్వహణ : బొబ్బిలి ఎంపిపిగా బొబ్బిలి సునీన ఏకగ్రీవంగా ఎన్నిక రేడియల్ రోడ్డు పనుల్లో చెట్ల తొలగింపునకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి:పరిగి ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ అచ్చంపేటలో ఎల్ నినో పై ప్రత్యేక గ్రామసభ గజపతినగరం ఎంపీపీగా గంట్యాడ శ్రీదేవి ప్రమాణ స్వీకారం యావపూర్ లో మహిళా సంఘం నూతన భవనం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. ఎమ్మెల్యే " కోండ్రు " టేక్మాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివా ళులు అర్పించిన మండల్ కాంగ్రెస్ నాయకులు శర్వానంద్ భోగి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 27న థియేటర్లలో మాస్ జాతర! ఎంపీపీగా దన్నాన పద్మావతి అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడికి మరింత కఠిన చర్యలు అవసరం.. డిసెంబరులో 0.50 శాతం వడ్డీ పెంపునకు ఫెడ్ గవర్నర్ వాలర్ సూచన! భోగాపురం ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ! తూప్రాన్ లో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ

అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యం

Select Suryaa Now
అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యం
  • ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు దిశానిర్దేశం
    బాడంగి, సూర్య: బాడంగి మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలనకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గురువారం స్థానిక టీడీపీ మండల కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, టీడీపీ మద్దతుతో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాడంగి ఎంపీపీ పదవికి గొల్లాది ఎంపీటీసీ బంటు అర్జునరావును, వైస్ ఎంపీపీ పదవికి వీరసాగరం ఎంపీటీసీ ఆవు సత్యనారాయణను టీడీపీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అదేవిధంగా బాడంగి గ్రామపంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా దేవరపల్లి రాజేశ్వరిని ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు సంయుక్తంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా, ప్రజా సమస్యలకు చట్టపరిధిలో పరిష్కారం చూపేలా పారదర్శకమైన పాలన అందించాలని సూచించారు. మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులకు సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ బాడంగి గ్రామపంచాయతీలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో వారితోపాటు టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు తదితరులు పాల్గొన్నారు