అర్హులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ :
సూర్య ముధోల్ మండలం :
ముధోల్ మండలం విట్టోలి గ్రామంలో గురువారం సర్పంచ్ రుచిత–దిగంబర్ చేతుల మీదుగా (14 )మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, గ్రామంలోని అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని సర్పంచ్ తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివరాజ్, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.