BREAKING
నెల్లిమర్ల ఎంపీపీ పీఠం కూటమి కైవసం ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు, * ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం కొత్తవలస ఎంపీపీగా కోళ్ల రమణమ్మ ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయలేం.. రామాయణం, పైర్ రెండింటినీ చూస్తారన్న ఇంతియాజ్ అలీ! ఉక్రెయిన్‌కు 45 బిలియన్ యూరోల రుణ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్వాగతం.. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల ఆదాయంతో నిధుల సమీకరణ! రాయదుర్గం తప్పిపోయిన 7వ తరగతి బాలుడిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు! వెల్దుర్తి పారిశ్రామికాభివృద్ధి రమేష్ శెట్టితోనే సాధ్యం ​రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ​గ్రామాభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మద్దతు: బొమ్మన దశరథరామిరెడ్డి ​నా ఎదుగుదలకు టీవీ శివయ్యే కీలకం: సంజన్న గౌడు ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి.. రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా శ్రీ దేవి దండుమారమ్మ 15వ వార్షికోత్సవం... చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం

ఎల్. కోట ఎంపీపీగా కోళ్ల ఉషశ్రీ, వైస్ ఎంపీపీగా కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
ఎల్. కోట ఎంపీపీగా కోళ్ల ఉషశ్రీ, వైస్ ఎంపీపీగా కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం

​లక్క వరపుకోట, నవంబర్ 19 మేజర్ న్యూస్ : మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) నూతన పాలకవర్గం గురువారం కొలువుదీరింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎల్. కోట ఎంపీపీగా కోళ్ల ఉషశ్రీ, వైస్ ఎంపీపీగా కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ గారు ప్రమాణ స్వీకారం చేశారు.
​ఈ సందర్భంగా ఎన్నికల అధికారి భానులత నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీలతో పాటు మండలంలోని ఇతర ఎంపీటీసీ సభ్యులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ​ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీపీ కోళ్ల ఉషాశ్రీ, వైస్ ఎంపీపీ కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్  మాట్లాడుతూ ఇప్పటికి 50 ఏళ్ల గా రాజకీయ కుటుంబం గా తమ కుటుంబం ఉందని ఎప్పుడు ఎవ్వరికి అపకారం చేయలేదు అన్నారు అధికారం వున్నా లేకున్నా అందరి మన్ననలు పొండేలా హుందాగా నడుచుకుంటా మని అధికారం శాశ్వతం కాదు అన్నారు.టీడీపీ పార్టీ ఇంకో 25 ఏళ్ల వరకు ఎల్ కోట మండలం లో నాయకులు కార్యకర్తల కృషి తో పటిష్టంగా ఉంటుంది అని జోష్యం చెప్పారు .. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని నిరంతరం కృషి చేస్తామని  ఈ సందర్భంగా స్పష్టం చేశారు.