BREAKING
ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు, * ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం కొత్తవలస ఎంపీపీగా కోళ్ల రమణమ్మ ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయలేం.. రామాయణం, పైర్ రెండింటినీ చూస్తారన్న ఇంతియాజ్ అలీ! ఉక్రెయిన్‌కు 45 బిలియన్ యూరోల రుణ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్వాగతం.. స్తంభింపజేసిన రష్యా ఆస్తుల ఆదాయంతో నిధుల సమీకరణ! రాయదుర్గం తప్పిపోయిన 7వ తరగతి బాలుడిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు! వెల్దుర్తి పారిశ్రామికాభివృద్ధి రమేష్ శెట్టితోనే సాధ్యం ​రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ​గ్రామాభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మద్దతు: బొమ్మన దశరథరామిరెడ్డి ​నా ఎదుగుదలకు టీవీ శివయ్యే కీలకం: సంజన్న గౌడు ధీరత్వానికి నిదర్శనం ఝాన్సీ లక్ష్మీబాయి.. రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా శ్రీ దేవి దండుమారమ్మ 15వ వార్షికోత్సవం... చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం

గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

Select Suryaa Now
గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలులోని శ్రీమాటూరు రాఘవరావు శాఖ గ్రంథాలయము నందు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 6వ రోజైనా గురువారం మహిళా దినోత్స వాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ఎంపీపీఎస్ (బి.కే) పాఠశాల ఉపాధ్యాయులు పడమట రమాకుమారి ముఖ్యఅతిథిగా హాజరయారు. ఆమె మాట్లాడుతూ మహిళలు స్వయంగా ఎదగాలి అంటే తప్పనిసరిగా చదువు ముఖ్యమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలోను తమ ప్రతిభను చాటుతున్నారని, అలాగే ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలోను మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి ఒక్కరు తమ జీవితంలో మహిళలకు మద్దతుగా నిలబడాలని తెలియజేశారు. అనంతరం సీనియర్ విభాగంలో మహిళా దినోత్సవ ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు, జూనియర్ విభాగంలో నీతిపద్యాలు వ్రాయడం పై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శుక్రవారం ముగింపు రోజున వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం ఉంటుందని, విద్యార్థులు తప్పక హాజరు కావాలని శాఖ గ్రంథాలయాధికారి కలపాల సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు.