కుందుర్పి సర్పంచ్ కు కూటమి అభ్యర్థిగా గంగాధర్*
*కుందుర్పి సర్పంచ్ కు కూటమి అభ్యర్థిగా గంగాధర్* కుందుర్పి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో మండల కేంద్రమైన కుందుర్పి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం నుండి ఎస్ కె గంగాధరను ఎంపిక చేశారు. ఉన్నత విద్యావంతుడైన గంగాధర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక కావటంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై అవగాహన కలిగిన గంగాధర్,కరోనా సమయంలో మండల వ్యాప్తంగా అనేకసామాజిక సేవ కార్యక్రమాల నిర్వహించారు. అనేక దైవ కార్యక్రమాల్లో ముందుండి తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించే గంగాధర్ బలమైన సామాజిక వర్గానికి వ్యక్తి కావటం ఆయనకు కలిసి వచ్చే అవకాశం. మండలంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలలో ముందుండే గంగాధర్ సర్పంచ్ ఎన్నికైతే ప్రజాసమస్యలను ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగే విద్యావంతుడు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రదాతగా పిలవబడే ఎమ్మెల్యే సురేందర్ బాబు సహకారంతో పంచాయతీకి సంబంధించి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధిచేసే అవకాశం ఉందంటూ ప్రజల్లోచర్చ మొదలైంది.ఏదిఏమైనా కుందుర్పి పంచాయతీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి. *టి. రాజు నేటిదినపత్రిక సూర్య కుందుర్పి*