BREAKING
గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం ఆసియా-పసిఫిక్ సదస్సులో కనిపించిన ‘అణు సూట్‌కేస్’.. అసలేమిటీ అత్యంత రహస్య రక్షణ పరికరం? ఆసియా-పసిఫిక్ సదస్సులో కనిపించిన ‘అణు సూట్‌కేస్’.. అసలేమిటీ అత్యంత రహస్య రక్షణ పరికరం? ఎల్. కోట ఎంపీపీగా కోళ్ల ఉషశ్రీ, వైస్ ఎంపీపీగా కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం తుదివిడత సమరానికి సిద్ధం హృదయాల భౌగోళిక బంధం: లెవాంట్ ప్రాంత పునర్నిర్మాణంలో చేతులు కలిపిన తుర్కియే, లెబనాన్! ఎంపీపీగా దేవరింటి లీలావతి ఏకగ్రీవం.. తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీ పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన బోయిన. భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు అర్హులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ : కుందుర్పి సర్పంచ్ కు కూటమి అభ్యర్థిగా  గంగాధర్*  గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ విద్యుత్ శాఖ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి.. డిస్కం నాయకుడు జయరామయ్య.

పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ

Select Suryaa Now
పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ

పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ సానా సతీష్....
 

అమలాపురం మేజర్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ పేద ముస్లిం మైనార్టీ విద్యార్థిని ఉన్నత చదువుల కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పెద్ద మనసు చాటుకున్నారు. లండన్‌లో ఎంబీఏ చదువుకోవాలన్న ఆ విద్యార్థిని కలకు తన ఆర్థిక సాయంతో రెక్కలు తొడిగి అండగా నిలిచారు. ఎంపీ ఉదార స్వభావం పట్ల కోనసీమ ముస్లిం మైనార్టీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.వివరాల్లోకి వెళితే... అమలాపురానికి చెందిన మహమ్మద్ రెహనా అనే విద్యార్థిని లండన్‌లో ఎంబీఏ చదవాలని భావించింది. అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూసింది. ఇటీవల రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన సానా సతీష్.. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఆహ్వానం మేరకు కోనసీమ విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ బూత్ కన్వీనర్ వెంకటేశ్వరరావు ద్వారా రెహనా తన పరిస్థితిని వివరిస్తూ ఎంపీకి వినతిపత్రం అందజేసింది.విద్యార్థిని విజ్ఞప్తిపై ఎంపీ సానా సతీష్ తక్షణమే స్పందించారు. ఉన్నత చదువుల పట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించి పూర్తి అండదండలు అందించారు. రెహనా ఎంబీఏ చదువుకు అయ్యే ఖర్చుతో పాటు, లండన్ వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులన్నీ తానే భరించి ఆమెను విదేశాలకు పంపారు.సకాలంలో స్పందించి పేద విద్యార్థిని జీవితంలో వెలుగులు నింపిన ఎంపీ సానా సతీష్‌కు కోనసీమ ముస్లిం మైనార్టీ నాయకులు, పెద్దలు ఘనంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో స్టేట్ వక్ఫ్ బోర్డ్ సభ్యులు హాజీ ముఖరం హుస్సేన్, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ అజమ్, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అధ్యక్షులు మహమ్మద్ బషీర్, టీడీపీ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మిరాన్ షరీఫ్, జనసేన నాయకులు మహమ్మద్ మహబూబ్ షరీఫ్, ఖాదర్ వలీ తదితరులు ఉన్నారు.రంబాల 

సత్యనారాయణ మేజర్ న్యూస్ అమలాపురం