నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్
మంత్రాలయం, సూర్య ప్రతినిధి* రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు గిరిబాబు, రామకృష్ణ, ఎస్‌ఐ మల్లికార్జున ఉన్నారు.
*నాగరాజు, సూర్య ప్రతినిధి, మంత్రాలయం, కర్నూలు జిల్లా.*