విద్యుత్ శాఖ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి.. డిస్కం నాయకుడు జయరామయ్య.
తంబళ్లపల్లె, మేజర్ న్యూస్,
ఏపీ ఎస్ ఈ బి ఎస్ బి మరియు ఎస్టీ అసోసియేషన్ కు సంబంధించి కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆ శాఖ జిల్లా నాయకుడు జయరామయ్య హామీ ఇచ్చారు. గురువారం తంబళ్లపల్లెలో విద్యుత్ శాఖ కార్మికుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ శాఖ కార్మికులు తమ సమస్యలను తమ దృష్టికి తేవాలని సూచించారు. అదేవిధంగా అసోసియేషన్ అభివృద్ధి గురించి సంఘ సభ్యులకు విశదీకరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ నాయకులు సుబ్రహ్మణ్యం, శంకరయ్య, డిస్కం పబ్లిసిటీ సెక్రటరీ రంగయ్య, అన్నమయ్య జిల్లా ఎస్ఏ ఓ బాలు, ఈఈ విజయ్ భాస్కర్ లు పాల్గొని తంబళ్లపల్లె మండలం లోని విద్యుత్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లైన్స్పెక్టర్లు భాస్కర్, రమణ, లైన్మెన్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గౌరీ శంకర్, తంబళ్లపల్లి